అధ్వానంగా తాండూర్- బషీరాబాద్ రోడ్డు
VKB: తాండూర్ నుంచి బషీరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి మృత్యుపాశంగా మారింది. రోడ్డుపై వెలిసిన భారీ గుంతలతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.