వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
MLG: రైతును రాజు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య అన్నారు. మండలంలోని అక్కినపల్లి మల్లారం గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగ పరుచుకోవాలి అన్నారు.