లింబాద్రిగుట్టపై గుండెపోటుతో భక్తుడు మృతి
NZB: భీమగల్ లింబాద్రిగుట్టపైకి దర్శనానికి వచ్చిన భక్తుడు గుండెపోటుతో మరణించాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌కు చెందిన ఓ కుటుంబం దైవ దర్శనానికి వచ్చింది. గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గుర్తించిన స్థానికులు వెంటనే కారులో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో గుండెపోటుతో మరణించాడు.