జలపాతం సందర్శనకు వెళ్లి దారితప్పిన NIT విద్యార్థులు

MLG: వెంకటాపురం మండలం మహితపురం గ్రామ సమీపంలోని జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన వరంగల్ NITకి చెందిన ఏడుగురు విద్యార్థులు శనివారం రాత్రి తప్పిపోయారు. అడివిలో దారి తెలియక డయల్ 100కు కాల్ చేసినట్లు అధికారులు తెలిపారు. స్పందించిన పోలీసులు, అటవీశాఖ అధికారులు రెస్క్యూ చేసి వారిని బయటకు తీసుకువచ్చారు. జలపాతాల సందర్శనకు అనుమతి లేకుండా ఎవరు వెళ్ళవద్దని అధికారులు తెలిపారు.