కాలువలో మహిళ మృతదేహం లభ్యం

కాలువలో మహిళ మృతదేహం లభ్యం

నాగర్‌కర్నూల్ జిల్లా రూలర్ మండలం కుమ్మెర గ్రామ సమీపంలోని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలో కురువ సాయమ్మ (60) మృతదేహం ఆదివారం కారుకొండ గ్రామ సమీపంలో లభ్యమైంది. బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామానికి చెందిన సాయమ్మ గత నాలుగు రోజులుగా కనిపించకుండా పోయినట్లు ఆమె కుమారులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.