మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన MLA
NRML: సారంగాపూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలను నిర్మల్ MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి సోమవారం స్థానిక అధికారులు, రైతులతో కలిసి ప్రారంభించారు. రైతుల పండించిన తమ పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని కోరారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు త్రాగునీరు, పలు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.