చిత్తశుద్ధితో మనమంతా బాధ్యత వహించాలి: ఎమ్యెల్యే

చిత్తశుద్ధితో మనమంతా బాధ్యత వహించాలి: ఎమ్యెల్యే

శ్రీకాకుళం: ప్రజాసేవకే మనజీవితం అంకితమని, చిత్తశుద్ధితో మనమంతా బాధ్యతవహించాలని శ్రీకాకుళం ఎమ్యెల్యే గొండు శంకర్ అన్నారు. గురువారం శ్రీకాకుళంలోని టీడీపీ కార్యాలయంలో అబ్జర్వర్ చింతలపూడి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఇన్‌ఛార్జులు, నాయకులు, కార్యకర్తలు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మనమీద నమ్మకంతో సీఎం చంద్రబాబు బాధ్యతను అందించారని గుర్తించారు.