ఆ ఊరు పేరులోనే దీపావళి ఉంది
SKLM: దీపావళి పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. దీపాలు వెలిగిస్తూ, టపాసులు కాలుస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా దీపావళి పండుగను ఆనందంగా గడుపుతారు. టెక్కలి మండలం అయోధ్యపురం పంచాయతీ పరిధిలోని దీపావళిపేట గ్రామంలో దీపావళి పేరు ఉండడం గ్రామం ప్రత్యేకత. గ్రామంలో సుమారు 50 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. తమ గ్రామం పేరుతో పండుగ ఉండడంతో ఆనందంగా ఉందని గ్రామస్థులు అంటున్నారు.