సేవాలాల్ ఆలయ నిర్మాణానికి సహకరించండి: మంత్రికి వినతి

సేవాలాల్ ఆలయ నిర్మాణానికి సహకరించండి: మంత్రికి వినతి

గద్వాల జిల్లాలో సంత్ సేవాలాల్, జగదాంబ దేవి ఆలయాల నిర్మాణానికి సహకరించాలని సేవాలాల్ సమితి జిల్లా ఉపాధ్యక్షులు రవి నాయక్ కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. జిల్లాలో బంజారాల ఆరాధ్య దైవం ఆలయాలు లేక ఇబ్బంది పడుతున్నామని మంత్రికి వివరించారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందించరానారు.