'తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి'
HNK: పరకాలలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సర్పంచులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. మౌలిక వసతుల మెరుగుదలతో పాటు ప్రభుత్వ పథకాలను అర్హులకు చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎండాకాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా మిషన్ భగీరథ, బోర్లు, పైప్‌లైన్ మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు.