VIDEO: అక్రమ మద్యం, గంజాయి రవాణాపై ఉక్కుపాదం

WG: తణుకులో అక్రమంగా మద్యం, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపామని ఎక్సైజ్ సీఐ సత్తి మణికంఠ రెడ్డి తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని డ్రైడే కారణంగా అక్రమ మద్యం రవాణాను అడ్డుకునేందుకు గురువారం రాత్రి తణుకు జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సైలు బి.లక్ష్మి, ఆర్.మధుబాబు, సిబ్బంది పాల్గొన్నారు.