అభయ వీరాంజనేయ స్వామి ఆలయంలో భజన కార్యక్రమం

అభయ వీరాంజనేయ స్వామి ఆలయంలో భజన కార్యక్రమం

KNR: శ్రావణమాసం సందర్భంగా చొప్పదండి మర్లవాడ అభయ వీరాంజనేయ స్వామి ఆలయంలో భజన కార్యక్రమం కరతాళ ధ్వనులతో వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ పిలుపు మేరకు జ్ఞాన సరస్వతి, హనుమాన్ భజన మండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తమ గాయకుడు చీకట్ల లచ్చయ్య, జ్ఞాన సరస్వతి బృందం ప్రధాన సభ్యురాలు దండే రమాదేవిరవీందర్, అమరగొండ తిరుపతి, పాల్గొన్నారు.