ఎన్నికల ప్రక్రియపై పార్టీలతో కలెక్టర్ సమావేశం

సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టీ.ఎస్. చేతన్ గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పార్టీల అభ్యంతరాలు, సూచనలు కోరుతూ, బూత్ స్థాయి ఏజెంట్లను గుర్తించాలని, అలాగే ఓటరు జాబితాలో తప్పులు ఉంటే వచ్చే సమావేశంలో సమర్పించాలని ఆయన సూచించారు.