ఆ రైతుల సమస్యలు పరిష్కరిస్తాం: పెమ్మసాని
AP: అమరావతిలో 1,286 ప్లాట్లకు వీధి పోటు సమస్యలు ఉన్నట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు రైతులు వివరించారు. దీంతో ఆ సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులు కోరితే వేరే చోట ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. పెన్షన్లు, హెల్త్ కార్డుల సమస్యలను 30 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. ప్రతి 14 రోజులకొకసారి రైతుల సమస్యలను వింటామని హమీ ఇచ్చారు.