VIDEO: తొర్రూర్ మున్సిపాలిటీలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
MHBD: తొర్రూర్ పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. తొర్రూరు మున్సిపల్ పరిధిలో ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీస్ స్టేషన్ నుంచి పలు కాలనీలో పోలీసు బలగాలతో కవాతు నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రమాణ స్వీకారం జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పి శబరీష్ తెలిపారు.