'ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలి'
VZM: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 41 ఫిర్యాదులు అందగా, భూతగాదాలు, కుటుంబ కలహాలు, నగదు వ్యవహారాలు తదితర అంశాలకు సంబంధించినవిగా ఉన్నాయని తెలిపారు. ఫిర్యాదులను పరిశీలించి చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాలన్నారు.