ఓయూలో ఫార్మ్ డీ పరీక్షా ఫీజు స్వీకరణ

HYD: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మూడూ, ఆరేళ్ల ఫార్మ్ డీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సుల అన్ని సంవత్సరాల ఇన్‌స్టాంట్ పరీక్షా ఫీజును వచ్చే నెల 7వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష తేదీలను త్వరలో తెలుపుతామన్నారు.