ఎనుమాముల మార్కెట్ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శిగా మల్లేశం
WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ నూతన సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శిగా రుద్రాక్షి మల్లేశం బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మార్కెట్ కమిటీలో పనిచేసిన మల్లేశం బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా మార్కెట్ పరిధిలోని అధికారులు, వ్యాపారులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.