డ్రోన్ ద్వారా ట్రాక్టర్ మిస్ కేసు దర్యాప్తు

NDL: నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఏఎస్పీ సూచనలతో పాణ్యం సీఐ, ఎస్సైల ఆధ్వర్యంలో శాంతిరాం హాస్పిటల్ ఎదురుగా, మంగళవారం గాజులపల్లి, బసాపురం, మహదేవపురం గ్రామాల్లో ట్రాక్టర్ మిస్ అయిన కేసు దర్యాప్తులో భాగంగా డ్రోన్ సాయంతో పరిశీలన చేపట్టారు. ఆధునిక పద్ధతులు వినియోగిస్తూ దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.