నేడు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం

నేడు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం

GNTR: గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం బుధవారం ఉదయం 11:30కి జరగనుంది. కోవెలమూడి రవీంద్ర ఇటీవల జరిగిన ఎన్నికల్లో మేయర్‌గా గెలుపొందారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఈ సమావేశం జరుగుతుంది. దీంతో ఈ సమావేశానికి ప్రత్యేకత ఏర్పడింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.