'పాడి గేదెల పథకానికి దరఖాస్తు గడువు పెంపు'
PDPL: జిల్లాలో ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులకు 2 పాడి గేదెల పథకం దరఖాస్తు గడువు ఈ నెల 16 వరకు పొడిగించినట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు శ్రావణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కనీసం 10 గుంటల వ్యవసాయ భూమి కలిగిన వారు సంబంధిత పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని సంబంధిత మున్సిపల్, మండల పరిషత్ కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు.