వారసంత స్థలంలో వ్యాపారాలు చేసుకోండి: నగర పాలక కమిషనర్

వారసంత స్థలంలో వ్యాపారాలు చేసుకోండి: నగర పాలక కమిషనర్

కరీంనగర్: మేడిపల్లి సెంటర్‌లో ఆక్రమణలు తొలగిస్తున్న నేపథ్యంలో చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోకుండా ప్రత్యామ్నాయంగా సమీపంలోని ఎన్.టి.పి.సి వార సంత స్థలంలో వ్యాపారాలు చేసుకోవచ్చని శనివారం రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ సి. హెచ్. శ్రీకాంత్ తెలిపారు. హైవే రోడ్డు ఆనుకుని షెడ్లు వేసి వ్యాపారాలు నిర్వహించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని కమిషనర్ అభిప్రాయపడ్డారు.