CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
సత్యసాయి: మడకశిర పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు సోమవారం లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. మడకశిర నియోజకవర్గానికి చెందిన 58 మందికి రూ. 18,53,698 రూపాయలు మంజూరు కావడంతో ఆ చెక్కులను ఎమ్మెల్యే పేదలకు అందజేశారు. పేదలకు సీఎం సహాయనిది ఎంతో దోహదం చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.