బీజేపీ శ్రేణులకు నామినేటెడ్ పదవులు

EG: భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్న శ్రేణులకు పార్టీ అధిష్ఠానం నామినేటెడ్ పదవులను కల్పించింది. రాజమండ్రిలో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ( U.P.H.C ) హాస్పిటల్‌కు 9 మందిని డైరెక్టర్లుగా ఇవాళ నియమించింది. వారికి నియామకపత్రాలను ఆదివారం ఎమ్మెల్సీ సోము వీర్రాజు పార్టీ కార్యాలయంలో అందజేశారు. పదవులను బాధ్యతగా భావించాలని వీర్రాజు అన్నారు.