సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. రంజీ ట్రోఫీ 2025-26 తర్వాతి రౌండ్ మ్యాచ్‌ల నుంచి తప్పుకోనున్నాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు ఈ రెడ్ బాల్ క్రికెట్ మ్యాచ్‌కు దూరంగా ఉండాలని సూర్య నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనిపై తన నిర్ణయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కి తెలియజేశాడు.