'ప్రభుత్వ సేవల విషయంలో అలసత్వం సహించబోము'
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కలెక్టరేట్లో కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా అధికారులతో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవల నాణ్యతను పెంచడం ద్వారానే సానుకూల ప్రజాభిప్రాయం సాధ్యమవుతుందని తెలిపారు. సేవల విషయంలో అలసత్వం సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు.