నేడు బీసీ రిజర్వేషన్లపై ఉత్తర్వులు

నేడు బీసీ రిజర్వేషన్లపై ఉత్తర్వులు

TG: పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది. ఇదే అంశంపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్నందున.. తాజా పిటిషన్లలో ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చనేది పరిశీలిస్తామని జస్టిస్ మాధవిరెడ్డి వెల్లడించారు. అవసరమైన వాటిలో మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని విచారణ వాయిదా వేశారు.