ఉమ్మడి జిల్లాలోని గ్రామాల్లో గందరగోళం..!

ఉమ్మడి జిల్లాలోని గ్రామాల్లో గందరగోళం..!

ఉమ్మడి వరంగల్ జిల్లాకు 15వ ఆర్థిక సంఘం కింద రూ.150 కోట్లు నిధులు మంజూరైన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా పాలక వర్గాలు లేకపోవడంతో కార్యదర్శులే ఖర్చులు పెట్టి పనులు నిర్వహించారు. పాత సర్పంచ్‌లు కూడా ఖర్చు చేసి లెక్కలను కార్యదర్శికి అప్పగించి వెళ్లారు. నిధులను తమకే ఇవ్వాలని కార్యదర్శులు, పాత సర్పంచ్‌లు, కొత్త సర్పంచ్‌లతో వాగ్వాదానికి దిగుతున్నట్లు సమాచారం.