చెరువు భూమి దీక్షకు వైసీపీ మద్దతు..!

చెరువు భూమి దీక్షకు వైసీపీ మద్దతు..!

AKP: పెద్దపల్లిలోని సర్వే నంబరు 286లో 3.27 ఎకరాల చెరువు భూమి కోసం జరుగుతున్న నిరాహార దీక్షకు వైసీపీ మద్దతు ప్రకటించింది. యువకుల ఆరోగ్యానికి హాని కలిగితే స్థానిక ఏమ్మార్వో, ఆర్డీవో బాధ్యత వహించాలని వైసీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బోదెపు గోవింద్, బొద్దపు ఎర్రయ్యదొర, దాసరి కుమార్‌తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.