ఎమ్మెల్యేని కలిసిన నూతన ఎంపీడీవో
JN: పాలకుర్తి ఎంపీడీవోగా ఇటీవల నూతన బాధ్యతలు స్వీకరించిన వేదవతి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మండలాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతతో పనిచేయాలని ఎంపీడీవోకు ఎమ్మెల్యే సూచించారు. ఈ మేరకు ప్రజలతో అనుసంధానం పెంచి, గ్రామ స్థాయిలో సమస్యలను చురుకుగా గుర్తించి పరిష్కరించాలన్నారు.