రథ సప్తమికి ఏర్పాట్లు

తిరుమల: తిరుమలలో ఫిబ్రవరి 16న రథసప్తమి సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తిరుమలకు వచ్చే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.