పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్
ప్రకాశం: కొండపి బీసీ కాలనీలో పేకాట ఆడుతున్న ఐదు మందిని స్థానిక ఎస్సై ప్రేమ్ కుమార్ శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ. 4,420 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.