'మట్టి విగ్రహాల పంపిణీలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం'

'మట్టి విగ్రహాల పంపిణీలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం'

BDK: కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి విగ్రహాల పంపిణీలో నిర్లక్ష్యం జరిగిందని ఉత్సవ కమిటీ కార్యదర్శి సత్యనారాయణ బుధవారం విమర్శించారు. ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మట్టిని దేవునిగా చేద్దాం అనే నినాదం చేసినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం చేశారన్నారు.