ఆదోనిలో హైడ్రా తరహా విధానం రావాలి: కమిషనర్

ఆదోనిలో హైడ్రా తరహా విధానం రావాలి: కమిషనర్

KRNL: ఆదోనిలో కాలువలపై అక్రమాలు పెరుగుతున్నాయి. 15 అడుగుల విస్తీర్ణం ఉండాల్సిన కాలువలను కేవలం 2 అడుగులకే పరిమితం చేసి పెద్ద పెద్ద భవనాలు నిర్మించారని మున్సిపల్ కమిషనర్ ఎం. కృష్ణ తెలిపారు. ఈ పరిస్థితుల్లో వర్షాల సమయంలో నీటి ముంపు తప్పదని ఆయన హెచ్చరించారు. హైడ్రా వంటి విపత్తు వస్తేగాని ఆదోనిలో కాలువల పరిస్థితిని మార్చలేము అని కమిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు.