రాజమండ్రి వాసికి ప్రతిష్టాత్మక అవార్డు

రాజమండ్రి వాసికి ప్రతిష్టాత్మక అవార్డు

E.G: ప్రతిష్టాత్మకమైన "ఇండియన్ అచీవర్స్ అవార్డు 2025” పురస్కారం చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ డా. కుమార్ రాజా చిట్టూరికి దక్కింది. ఈయన రాజమండ్రికి చెందిన వ్యక్తి. ఇటీవల ఢిల్లీలో జరిగిన కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. వృత్తిపరమైన విజయాలు, దూరదృష్టి గల నాయకత్వం, వివిధ రంగాల్లో ఆయన చేసిన విలక్షణ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందుకున్నారు.