రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. AP16TW7058 నంబర్ గల లారీ అదుపుతప్పి కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.