అనకాపల్లిలో ధ్రువపత్రం అందుకున్న కొణతాల

అనకాపల్లిలో ధ్రువపత్రం అందుకున్న కొణతాల

అనకాపల్లి: నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ హామీ ఇచ్చారు. మంగళవారం రాత్రి ధ్రువపత్రాన్ని జాయింట్ కలెక్టర్ జాహ్నవి నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనను ఆదరించిన అనకాపల్లి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తన గెలుపు కోసం పనిచేసిన జనసేన, బీజేపీ, టీడీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేశారు.