అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్ల పంపిణీ
NLG: నకిరేకల్‌లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే, విప్ వేముల వీరేశం అంగన్‌వాడీ టీచర్లకు గురువారం సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు. సేవలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఈసందర్భంగా చిట్యాల మండల అంగన్వాడి టీచర్లు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో లావణ్య, ఏసీడీపీవో వెంకటమ్మ, సూపర్‌వైజర్ సునీత అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.