VIDEO: కృష్ణాలో 8,240 హెక్టార్లలో పంటల నష్టం

కృష్ణా: అధిక వర్షాల, వరదలతో ఉమ్మడి కృష్ణాలో 8,240 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. NTRలో 160 గ్రామాల్లో 4,252 మంది రైతులు 3,053 హెక్టార్ల వరి, 971 హెక్టార్ల పత్తి, 198 హెక్టార్ల మినుము, 397 హెక్టార్ల పెసర పంట నష్టం వాటిల్లగా, కృష్ణాలో 46 గ్రామాలలో 3,702 మంది రైతులు 3,620 హెక్టార్ల వరి, 1 హెక్టార్లో మొక్కజొన్న నష్టం వచ్చిందన్నారు.