ఢిల్లీ బాంబర్ ఉమర్ ఇంటి కూల్చివేత
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో బాంబు దాడికి పాల్పడిన డా.ఉమర్ నబీ ఇంటిని అధికారులు కూల్చివేశారు. జమ్ముకశ్మీర్ పుల్వామాలోని అతడి నివాసాన్ని భద్రతాబలగాలు తెల్లవారుజామున నేలమట్టం చేశాయి. కాగా, పేలుడు ఘటన కారణంగా 12 మంది అమాయక ప్రజలు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారకులుగా అనుమానిస్తూ.. 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.