ప్రమాదానికి గురైన జర్నలిస్ట్ దంపతులు
వరంగల్-ఖమ్మం రహదారిలో నాగమయ్య ఆలయం వద్ద ఇవాళ ప్రమాదంలో హనుమకొండ సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస శర్మ, ఆయన భార్య వాణి గాయపడ్డారు. ఆలయ దర్శనం ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ ద్వారా MGM ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.