హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు: బీఆర్‌ఎస్ నేతలు
మహబూబాబాద్ పట్టణంలో క్యాంప్ కార్యాలయంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలతో కలిసి గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాంటిదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు.