టమోటా లోడుతో వెళుతున్న లారీ బోల్తా
CTR: మొలకల చెరువు నుంచి చెన్నైకు టమోటా లోడుతో వెళుతున్న లారీ పుంగనూరు లక్కుంట జంక్షన్‌లో బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా టమోటాలు రోడ్డుపై పడిపోయాయి. అదృష్టవశాత్తు ఎదురుగా, పక్కన ఏ వాహనం రాలేదు. డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతోని ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.