వైసీపీ జిల్లా అధికార ప్రతినిధిగా మురళి నియామకం

కోనసీమ: వైసీపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంకి చెందిన పెమ్మిరెడ్డి మురళి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయని మురళి తెలియజేశారు. మురళి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు అత్యంత సన్నిహితులుగా పేరుంది. పార్టీకి చెందిన పలువురు మురళీని అభినందించారు.