'నివేదికలను వెంటనే అందజేయాలి'

కృష్ణా: రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 15, 16 తేదీలలో నిర్వహించే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు అవసరమైన వివరాలతో కూడిన నివేదికలను వెంటనే అందజేయాలని జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి కలెక్టరేట్ చాంబర్లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి శాఖల వారీగా సమీక్షించారు.