ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని కలెక్టర్ రాజకుమారి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అత్యవసర విభాగం, ఓపీ, ఇన్‌పేషెంట్ వార్డులు, రిజిస్ట్రేషన్ బ్లాక్‌ను ఆమె పరిశీలించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.