క్షిపణి ఇంజిన్ పరీక్షించిన ఉ.కొరియా
అమెరికాను చేరుకునేంత శక్తిమంతమైన ఘన ఇంధన క్షిపణి ఇంజిన్‌ను ఉత్తర కొరియా పరీక్షించింది. ఈ పరీక్షతో అణు దాడి సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునే దిశగా ఉత్తర కొరియా మరో అడుగు ముందుకేసింది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నిర్దేశించిన మేరకు క్షిపణి సామర్థ్య ఆధునికీకరణను వేగవంతం చేసింది. ఈ పరీక్షను కిమ్ స్వయంగా వీక్షించారు.