VIDEO: రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి
WGL: గీసుగొండ మండలం గంగదేవిపల్లి చెందిన గూడ సంతోష్ కుమార్ (46) ఆర్టీసీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సంతోష్ కుమార్ తన ద్విచక్ర వాహనాన్ని రిపేర్ చేయించుకుని వరంగల్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో 16వ డివిజన్ ధర్మారం సమీపంలో అకస్మాత్తుగా కుక్క అడ్డుగా రావడంతో వాహనం అదుపుతప్పింది. దీంతో డివైడర్‌ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.