వసతులు కల్పించాలని విద్యార్థుల ధర్నా

MBNR: బాలానగర్ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో గత మూడు నెలలుగా మరుగుదొడ్లు సరిగా లేవని మంచినీటి సౌకర్యానికి ఇబ్బందిగా ఉందని విద్యార్థులు శనివారం ధర్నా చేపట్టారు. స్పందించిన డీఈవో ప్రవీణ్ కుమార్ పాఠశాలకు చేరుకొని విద్యార్థుల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులు ధర్నా విరమించారు.