కాంగ్రెస్ హామీలు అమలు చేయాలని నిరసన
WGL: నర్సంపేట పట్టణంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.